Shreyas Iyer: క్రికెట్ మైదానంలో బ్యాట్‌తో రన్స్ కొట్టడం ఒకెత్తైతే, సోషల్ మీడియాలో శరీరాన్ని ప్రదర్శించడం ఇంకో ఎత్తు.. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) రీసెంట్‌గా చేసిన పని ఇప్పుడు నెట్టింట గట్టిగానే చర్చనీయాంశమైంది. తన ముంబై దోస్త్, టీమ్‌మేట్ అమన్ ఖాన్‌తో కలిసి జిమ్‌లో తెగ శ్రమించిన శ్రేయస్, దానికి గుర్తుగా షర్ట్ విప్పేసి హాట్ పోజ్ ఇచ్చాడు. ఆ పిక్ బయటకు రావడమే ఆలస్యం.. ఏంటి బాసూ.. కెప్టెన్ అయ్యావని షర్ట్ కూడా విప్పేయాలా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇంత షో అవసరమా?:
జింబాబ్వే టూర్ ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా జిమ్‌కి వెళ్లి చెమటోడ్చడం మెచ్చుకోవాల్సిందే. కానీ ఆ బాడీ కట్లను కెమెరాకు చూపిస్తూ షర్ట్ లేకుండా అమన్ ఖాన్‌తో ఇచ్చిన పోజులు చూస్తుంటే క్రికెట్ ప్రాక్టీస్ కంటే బాలీవుడ్ హీరో ఆడిషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఉందనే నెటిజన్స్ కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో చాలాసార్లు గాయాల పాలైన శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం మంచిదే. కానీ ఆ శ్రద్ధ అంతా షర్ట్ విప్పేసి పిక్స్ పోస్ట్ చేయడంలోనే కనిపిస్తోందని యూజర్లు వెటకారం ఆడుతున్నారు. ముంబై డొమెస్టిక్ క్రికెట్ రోజుల్లో నుంచి శ్రేయస్, అమన్ ఖాన్ మంచి స్నేహితులు. అయితే వీరు జిమ్‌లో నిజంగా వర్కౌట్ చేస్తున్నారా లేక కేవలం పిక్స్ కోసమే ఇలాంటి షర్ట్‌లెస్ పోజులిస్తున్నారా అని ఫ్యాన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
►ALSO READ | క్రికెట్లోకి పోర్చుగల్ దేశం.. ఫుట్ బాల్ స్థాయిలో సత్తా చూపిస్తామని సవాళ్లు
బ్యాటింగ్‌లో రన్స్ రావాలి.. సోషల్ మీడియాలో కాదు:
స్టేడియంలో క్రీజులోకి వెళ్తే గాయాల భయంతో జాగ్రత్తగా ఆడే శ్రేయస్, జిమ్‌లో మాత్రం షర్ట్ లేకుండా పిక్స్ ఇవ్వడానికి అస్సలు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. రాబోయే మ్యాచ్‌లలో బ్యాట్‌తో పరుగులు తీస్తే సరే సరి, లేకపోతే కేవలం ఇలాంటి షర్ట్‌లెస్ ఫొటోలకే పరిమితం కావాల్సి వస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
INDIAN T20I CAPTAIN - SHREYAS IYER 🔥⚡ pic.twitter.com/OqzoMslCKw
— Johns. (@CricCrazyJohns) August 11, 2026
