కొడుకు భయంతోనే చంద్రబాబు డీఎస్సీపై సీబీఐ విచారణ చేయడం లేదు: మాజీ మంత్రి రోజా

కొడుకు భయంతోనే చంద్రబాబు డీఎస్సీపై సీబీఐ విచారణ చేయడం లేదు: మాజీ మంత్రి రోజా

తిరుపతి జిల్లా నగరిలో డీఎస్సీ నియామకాలపై రాజకీయ వేడి రాజుకుంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన రోజా... పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఉద్యోగాలను అమ్ముకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -డీఎస్సీ పరీక్షా పేపర్ లీక్ అయిందని, డబ్బుల కోసం ఉద్యోగాలను అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరీక్షా పత్రాలు తయారు చేసే ఉద్యోగులకే ర్యాంకులు ఎలా వచ్చాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు.

ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.మంత్రి లోకేష్ రహస్య ప్రయాణాలు చేస్తూ, ఇక్కడ దోచుకున్న సొత్తును విదేశాలకు తరలిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడికి శిక్ష పడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు  డీఎస్సీ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని రోజా మండిపడ్డారు.