పాకిస్తాన్, ఐసీసీ మధ్య టీ20 ప్రపంచ కప్ వివాదం మరింత ముదురుతోంది. ఫిబ్రవరి 15న భారత్ జరిగే మ్యాచ్‌లో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించిన తర్వాత కీలకమైన గ్రూప్ ఎ మ్యాచ్ చుట్టూ గందరగోళం నెలకొంది. ఐసీసీ, పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగినప్పటికీ వివాదం కొలిక్కిరాలేదు. పైగా ‘‘భారత్‌తో మ్యాచ్ఆడం’’ అంటూ పాకిస్తాన్ మొండికేసింది. మరోవైపు ఈ వివాదంపై ఘాటుగా స్పందించిన ఐసీసీ.. మ్యాచ్ఆడతారా లేదా ఫైనల్‌గా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వివాదాన్ని ముగించేందుకు ఐసీసీ ఆదివారం ఓ అత్యవసర వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇదే టైంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం పాకిస్తాన్‌కు రావడం వివాదం కొత్త మలుపు తిరిగింది.
టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించిన తర్వాత సంఘీభావంతో భారత్ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది. ఆదివారం రాత్రి జరిగే ఐసీసీ, పీసీబీ మీటింగ్ లో పాకిస్తాన్క్రికెట్ బోర్డు అధ్యక్షుడితో కలిసి అమీనుల్ పాల్గొంటారని వార్తలు వస్తున్న క్రమంలో ఫిబ్రవరి 15 భారత్,పాక్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వివాదం ఏంటీ..
కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టునుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను తొలగించిన తర్వాత టీ 20 ప్రపంచకప్‌కు సంబంధించి వివాదం నెలకొంది. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ ను తొలగించారు. అయితే భద్రతా కారణాలంటూ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలకంకు మ్యాచ్ లు మార్చాలని బీసీబీ డిమాండ్ చేసింది.
ఈ వివాదంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB), ఐసీసీ ల మధ్య అనేక చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్ మొండిపట్టుతో వ్యవహరించింది. చివరికి బంగ్లాదేశ్ స్థానంలో గ్రూప్ సిలో స్కాట్లండ్ కు స్థానం కల్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐసీసీ అన్యాయం చేసిందంటూ బంగ్లాదేశ్ కు మద్దతుగా టీ 20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతామని పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(PCB) బెదిరింపులకు దిగింది.
ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిసిన నఖ్వీ చివరికి టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆడుతుంది .. అయితే భారత్ తో మాత్రం మ్యాచ్ లు ఆడదు అని ప్రకటించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఆదివారం ఐసీసీ, పీసీబీ సమావేశంతో భారత్ , పాకిస్తాన్మధ్య మ్యాచ్ ఉంటుందా లేదా అనేది తేలనుంది.
