Eesha Movie Team : బుక్ మై షోలో రేటింగ్ మాఫియా.. ‘ఈషా’ మూవీపై నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారంటూ నిర్మాతలు ఫైర్!

Eesha Movie Team : బుక్ మై షోలో రేటింగ్ మాఫియా.. ‘ఈషా’ మూవీపై నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారంటూ నిర్మాతలు ఫైర్!

త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్‌‌‌‌, వంశీ నందిపాటి విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా గురువారం (2025 డిసెంబెర్ 5న) సినిమా విడుదలైంది. థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

రిలీజ్ అవ్వకుండానే రివ్యూనా?

ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంగా చిత్ర  నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అమెరికాలో ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి పెద్ద రివ్యూ రాశారని  మండిపడ్డారు..  ఆయన్ని అడిగితే ఎవరో ఇండస్ట్రీ వ్యక్తులు చెప్పిన మాటలు విని రాశానని అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని సీరియస్ అయ్యారు. ఇలాంటి నెగెటివ్ వార్తలు చదివి సినిమాకు రాకుండా ఉండటానికి ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు. ప్రీమియర్స్ అన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.

బుక్ మై షో రేటింగ్ మాఫియా!

ఒక సినిమా రేటింగ్‌ను ఎలా కుట్రపూరితంగా తగ్గిస్తారో నిర్మాత బన్నీ వాస్ వివరించారు. "ఓ 300 టికెట్లు బుక్ చేసి, సినిమా అయిపోగానే అందరూ 1 రేటింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తారు. దీనివల్ల బుక్ మై షోలో రేటింగ్ పడిపోతుంది. సాధారణ ప్రేక్షకుడు ఆ రేటింగ్ చూసి సినిమాకు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. పోటీలో ఉన్నప్పుడు కొందరు ఇలా నెగెటివ్‌గా చేయడానికి సిద్ధంగా ఉంటారు అని ఆయన వెల్లడించారు.

కెరీర్ ముగుస్తుందని వార్నింగ్!

సీనియర్ నిర్మాత దామోదర్ ప్రసాద్ మరింత ఘాటుగా స్పందించారు. "రెండు, మూడు గదుల్లో కంప్యూటర్లు పెట్టుకుని నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారంటే ఇంతకంటే నీచమైన వ్యాపారం ఇంకోటి ఉండదు. నీ సినిమాను నువ్వు ప్రమోట్ చేసుకో, పక్కవాడి మీద ఎందుకు పడతావు? నేను గనుక నోరు విప్పి మాట్లాడితే మీ కెరీర్‌లు ముగుస్తాయి అని హెచ్చరించారు.

►ALSO READ | Mega-Victory Mass Song: క్రిస్మస్ ట్రీట్ ఇచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. ‘మెగా-విక్టరీ’ మాస్ సాంగ్‌ లోడింగ్...!

అసలు ఏంటీ 'ఈషా' సినిమా?

'ఈషా' అనేది కేవలం ఒక హారర్ సినిమా మాత్రమే కాదు. ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అడవి మధ్యలో ఉన్న ఒక పురాతన బంగళా.. అక్కడ ఉండే ఆత్మల చుట్టూ తిరిగే కథ ఇది. త్రిగుణ్, హెబ్బా పటేల్ నటన సినిమాకు హైలైట్ కాగా, సిరి హనుమంతు పాత్ర చాలా కీలకమైన మలుపులు ఇస్తుంది. ఈ సినిమాలో సౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడికి థియేటర్లో వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు. పాజిటివ్ టాక్ రావడంతో  ప్రస్తుతానికి థియేటర్లు కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటిని దెబ్బకొట్టడం సరైన పద్ధతి కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.