Arshdeep Singh: టీమిండియా నంబర్–1 టీ20 బౌలర్ అర్షదీప్ సింగ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బిగ్ షాక్ ఇచ్చింది. పొట్టి ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల ప్రవర్తించిన తీరుపై భారీగా ఫైన్ విధించింది. మ్యాచ్ ఫీజ్ లో 15 శాతం కోత పెట్టడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. గత 24 నెలల్లో ఇదే ఫస్ట్ తప్పిదం కావడంతో అర్షదీప్ మ్యాచ్ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో డారిల్ మిచెల్ పైకి అర్షదీప్ ప్రమాదకరంగా బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐసీసీ అతడిపై కఠిన చర్యలు చేపట్టింది.
వాస్తవానికి డారిల్ మిచెల్ పై అర్షదీప్ అంత సీరియస్ గా బంతిని విసరాల్సిన పని లేదు.. ఫాలో అప్ లో భాగంగా బాల్ ని వికెట్లపైకి విసరడంతో ప్రమాదవశాత్తు అది మిచెల్ కి గట్టిగా తాకింది. ఆ సమయంలో మిచెల్ సైతం సహనాన్ని కోల్పోవడంతో.. అర్షదీప్ అతన్ని పట్టించుకోకుండా తాను బౌలింగ్ చేసేందుకు వెళ్లిపోయాడు. దీంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో ఆగిపోయింది. ఈ ఘటన జరిగిన తర్వాత మిచెల్ కి క్షమాపణలు చెప్పిన అర్షదీప్ షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేస్తున్నారు.
►ALSO READ | CSK Fielding Coach: సీఎస్కేలో చేరిన కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్.. జేమ్స్ ఫోస్టర్ ఎంట్రీతో టీమ్లో కొత్త జోష్
ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.9 రూల్స్ ఉల్లంఘన కిందికి వస్తాయి. దీని ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ప్లేయర్ వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం తప్పు.. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్ చెల్లించుకున్నాడు. ఇక ప్రపంచకప్ ఫైనల్లో కివీస్ పై భారత్ 96 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది. మొత్తంగా ఐదో ప్రపంచకప్ లని టీమిండియా ఇప్పటి వరకు (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) కైవసం చేసుకుంది.
