న్యూఢిల్లీ: శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలి వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో టాప్ ఆర్డర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. వేలి కణజాలం పూర్తిగా రావడానికి మరింత సమయం పడుతుందని స్పోర్ట్స్ సైన్స్ విభాగం స్పష్టం చేసింది. దాంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా బరిలోకి దిగితే రిస్క్ పెరుగుతుందని వైద్యులు సూచించడంతో అతను సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
శ్రీలంక–ఎతో జరిగిన రెండు టెస్ట్‌లో రెండు సెంచరీలు కొట్టిన సుదర్శన్ రెండో మ్యాచ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో చికిత్స తీసుకుంటున్నాడు. సుదర్శన్ గైర్హాజరీతో దేవదత్ పడిక్కల్ మూడో ప్లేస్‌లో దిగడం దాదాపుగా ఖాయమైంది. అయితే సుదర్శన్ ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రేసులో ఉన్నా.. కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్ల నుంచి పూర్తి నమ్మకం లభించడం లేదు.
