హైదరాబాద్ సిటీ, వెలుగు: సాంకేతిక సమస్య కారణంగా మెట్రోవాటర్‌బోర్డు సిటిజన్ సర్వీసెస్ మొబైల్ యాప్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించి సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందం చర్యలు చేపడుతోందన్నారు.
ఈ నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ బుకింగ్ కోసం వినియోగదారులు తాత్కాలికంగా అందుబాటులో ఉన్న ఐవీఆర్‌ఎస్ సదుపాయం లేదా బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ సేవలు పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరారు.
