వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్‌షిప్: రజతం నెగ్గిన జావెలిన్ త్రోయర్ ఆశిష్

వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్‌షిప్: రజతం నెగ్గిన జావెలిన్ త్రోయర్ ఆశిష్

యూజీన్ (అమెరికా):  వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ అండర్‌‌–20 చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా పతకాల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన మెన్స్‌‌ జావెలిన్‌‌ త్రోలో ఆశిష్‌‌ ఈటెను 74.09 మీటర్ల దూరం విసిరి సిల్వర్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకున్నాడు. ఆశిష్‌‌ మూడో ప్రయత్నంలో ఈ దూరాన్ని నమోదు చేశాడు. ఓవరాల్‌‌గా నీరజ్‌‌ చోప్రా తర్వాత ఈ టోర్నీలో రజతం నెగ్గిన రెండో ప్లేయర్‌‌గా ఆశిష్‌‌ రికార్డులకెక్కాడు. టి. ధరణిధరన్‌‌ (72.35 మీటర్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సౌతాఫ్రికా త్రోయర్‌‌ జాన్‌‌ హెండ్రిక్స్‌‌ హేమన్స్‌‌ (80.50 మీటర్లు) గోల్డ్‌‌ మెడల్‌‌ను సాధించాడు. విమెన్స్‌‌ హైజంప్‌‌ క్వాలిఫికేషన్స్‌‌లో పూజా సింగ్‌‌ 1.79 మీటర్ల ఎత్తు నుంచి దూకి ఫైనల్స్‌‌కు అర్హత సాధించింది. మెన్స్‌‌ లాంగ్‌‌జంప్‌‌లో షానవాజ్‌‌ ఖాన్‌‌ (7.73 మీటర్లు), జితిన్‌‌ అర్జున (7.57 మీటర్లు) ఫైనల్‌‌ బెర్త్‌‌లు ఖాయం చేసుకున్నారు. మెన్స్‌‌ 400 మీటర్ల ఫైనల్లో మొహమ్మద్‌‌ అష్ఫాక్‌‌ (46.20 సెకన్లు) ఎనిమిదో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్‌‌ జావెలిన్‌‌ త్రోలో పూనమ్‌‌ ఫైనల్‌‌ చేరలేకపోయింది.