న్యూఢిల్లీ: విమెన్స్ టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. ‘ది హండ్రెడ్ టోర్నీ’లో గాయపడింది. సదరన్ బ్రేవ్ తరఫున ఆడుతున్న ఆమె తొడ కండరాలు పట్టేయడంతో మిగతా మ్యాచ్‌లకు దూరమైంది.
దాంతో రాబోయే విమెన్స్ టీ20 ఆసియా కప్‌కు జెమీమా అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ సమయం వరకు ఆమె కోలుకున్నా.. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తుందా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రేవ్ తరఫున 6 ఇన్నింగ్స్‌లు ఆడిన 25 ఏళ్ల జెమీమా 35.75 సగటుతో 143 రన్స్ చేసింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఇండియా.. థాయ్‌లాండ్ (30న)తో తలపడనుంది
