అరుదైన రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్.. ఐర్లాండ్‌తో వన్డేలో అఫ్గాన్ విజయం

అరుదైన రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్.. ఐర్లాండ్‌తో వన్డేలో అఫ్గాన్ విజయం

బ్రెడీ: స్టార్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ (6/34) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడుసార్లు ఆరు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌‌గా రికార్డు సృష్టించాడు. శుక్రవారం రాత్రి ఐర్లాండ్‌‌తో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత అందుకున్నాడు. రషీద్‌‌ బౌలింగ్‌‌ షోతో ఈ మ్యాచ్‌‌లో అఫ్గాన్‌‌ 92 రన్స్‌‌ తేడాతో ఐర్లాండ్‌‌పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో అఫ్గాన్‌‌ 1–0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన అఫ్గానిస్తాన్‌‌ 47 ఓవర్లలో 299/8 స్కోరు చేసింది.

ఇబ్రహీం జద్రాన్‌‌ (84), సెదికుల్లా అటల్‌‌ (45), హష్మతుల్లా షాహిది (36 నాటౌట్‌‌) రాణించారు. తర్వాత ఐర్లాండ్‌‌ 33.4 ఓవర్లలో 207 రన్స్‌‌కే ఆలౌటైంది. కేడ్ కార్మైకేల్ (62) టాప్‌‌ స్కోరర్‌‌. గతంలో రషీద్‌‌.. ఐర్లాండ్‌‌ (మార్చి 17, 2017), వెస్టిండీస్‌‌ (జూన్‌‌ 9, 2017)పై ఆరు వికెట్ల ఘనత సాధించాడు. అజంత మెండిస్‌‌, వానిందు హసరంగ, అకిల ధనంజయ (శ్రీలంక), ఇమ్రాన్‌‌ తాహిర్‌‌ (సౌతాఫ్రికా), షాహిద్‌‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌‌), సందీప్‌‌ లామిచానె (నేపాల్‌‌) వన్డేల్లో రెండేసిసార్లు ఆరు వికెట్లు తీశారు. ఓవరాల్‌‌గా వన్డేలో పాక్‌‌ పేసర్‌‌ వకార్‌‌ యూనిస్‌‌ ఐదుసార్లు ఆరు వికెట్ల ఘనత అందుకున్నాడు.