రూ.450 కోట్ల అప్పు ఆరోపణలు అవాస్తవం.. రూ.109.11 కోట్లు లోన్ తీసుకొని రూ.190 కోట్లు చెల్లించా

రూ.450 కోట్ల అప్పు  ఆరోపణలు అవాస్తవం.. రూ.109.11 కోట్లు లోన్ తీసుకొని రూ.190 కోట్లు చెల్లించా
  •      మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్‌‌‌‌రావు 

మంచిర్యాల, వెలుగు: బ్యాంకు అప్పుల విషయంలో బీజేపీ,  బీఆర్ఎస్ లీడర్లు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌‌సాగర్‌‌‌‌రావు అన్నారు. శనివారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లీడర్లు నడిపల్లి విజిత్‌‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

వివిధ బ్యాంకుల నుంచి తాను రూ.450 కోట్ల లోన్ మంజూరైనప్పటికీ రూ.109.11 కోట్లు మాత్రమే తీసుకున్నానని, తిరిగి వడ్డీతో సహా రూ.190 కోట్లు చెల్లించానని వెల్లడించారు. ఇదంతా చట్టబద్ధంగానే జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా తాను రూ.500 కోట్లు సంపాదించానని ప్రతిపక్ష పార్టీల లీడర్ల ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.