రేవంత్‌‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కోరలు తీస్తాం : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

రేవంత్‌‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కోరలు తీస్తాం : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం
  •     కేటీఆర్‌‌కు పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం హెచ్చరిక

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డిపై కేటీఆర్‌‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఆయన కోరలు పీకుతామని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం హెచ్చరించారు. శనివారం గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌‌తోపాటు హరీశ్‌‌రావు అహంకారంతో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌‌ కేడర్‌‌ ఎదురుతిరిగితే పరిస్థితి బాగుండదన్నారు. మాజీ ఐపీఎస్‌‌ అధికారి ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌‌రెడ్డిని అడ్డుపెట్టుకుని కేటీఆర్‌‌ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 

2014లో పెద్ది ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి పెద్ది అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించి ఉద్యమకారులపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని చెప్పారు. గద్దర్‌‌కు కేసీఆర్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ ఇవ్వకుండా అవమానించారని ఆరోపించారు.