వారం రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ సామాన్య ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది రానున్న పండుగల సీజన్ కోసం షాపింగ్ పై గందరగోళంలో ఉన్నారు. అయితే తాజాగా గురువారం రోజున గోల్డ్ అండ్ సిల్వర్ ఒక్కసారిగా భారీ తగ్గుదలను నమోదు చేయటంతో షాపర్లకు మంచి అవకాశంగా మారింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముందుగా తమ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలించుకోవటం మంచిది.
సెప్టెంబర్ 24న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. సెప్టెంబర్ 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.152 తగ్గాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 268గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 995గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 24, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి కేజీ రేటు రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 50వేలుగా మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.
