నిజామాబాద్, వెలుగు: కొత్త కల్లు బిజినెస్ చేసేందుకు వేలంలో పాల్గొనడానికి డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వనందుకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన 39 గౌడ కుటుంబాలు, 10 దళిత కుటుంబాలను వీడీసీ సభ్యులు బహిష్కరించారు. డప్పు చాటింపుతో బహిష్కరణను ప్రకటించారు. బుధవారం బాధితులు నిజామాబాద్ సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు.
ఏటా అక్టోబర్ 2 నుంచి కొత్త కల్లు వ్యాపారాన్ని వేలం ద్వారా దక్కించుకుంటారు. వేలం డబ్బును గీతకార్మిక కుటుంబాలకు పంచుతారు. కాగా తాళ్లరాంపూర్ వీడీసీ పెద్దలు తమకు డబ్బు చెల్లించి వేలంలో పాల్గొనాలని గౌడన్నలను, దళితులను కోరారు. దీనికి వారు నిరాకరించడంతో మొత్తం 49 కుటుంబాలను బహిష్కరిస్తూ బుధవారం డప్పు చాటింపు వేయించారు. వారితో ఎవరూ మాట్లాడకూడదని, కిరాణ సరుకులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది ఇలాగే జరగడంతో సీపీ తీవ్రంగా స్పందించి కేసులు నమోదు చేశారు.
