హైదరాబాద్: వైసీపీ అధికార ప్రతినిధి, వైసీపీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణం వైసీపీ శ్రేణులను కలచివేసింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఆయన నివాసంలో గుండెపోటుతో గురువారం ఉదయం చనిపోయారు.
కాకుమాను రాజశేఖర్ అకాల మరణంపై ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి చుండూరు రవిబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ గౌరవ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ అకాల మృతి కారణంగా ఈరోజు(గురువారం) జరగాల్సిన ఎంపీపీ, జడ్పీటీసీల సన్మాన కార్యక్రమం వాయిదా వేస్తు్న్నట్లు వైసీపీ ప్రకాశం జిల్లా శ్రేణులు తెలిపాయి.
