హిందీ, ఇంగ్లీష్ వచ్చా ? అయితే బ్యాంక్ జాబ్స్ మీకోసమే.. వయసు 30 ఏళ్లలోపు ఉంటే చాలు !

హిందీ, ఇంగ్లీష్ వచ్చా ? అయితే బ్యాంక్ జాబ్స్ మీకోసమే.. వయసు 30 ఏళ్లలోపు ఉంటే చాలు !

ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 23న ప్రారంభం కాగా అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 

పోస్టు పేరు: హిందీ ఆఫీసర్. 

ఎలిజిబిలిటీ
గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్​ సబ్జెక్టును మేజర్ లేదా ఎలెక్టివ్‌‌‌‌‌‌‌‌గా చదివి హిందీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీ సబ్జెక్టును మేజర్ లేదా ఎలెక్టివ్‌‌‌‌‌‌‌‌గా చదివి ఇంగ్లిష్​లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి లేదా హిందీ లేదా ఇంగ్లిష్ కాకుండా ఇతర సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ డిగ్రీ స్థాయిలో హిందీని మేజర్/ ఎలెక్టివ్‌‌‌‌‌‌‌‌గా చదివి, ఇంగ్లిష్​ మాధ్యమంలో పరీక్షలు రాసి ఉండాలి లేదా హిందీ లేదా ఇంగ్లిష్ కాకుండా ఇతర సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్​ను మేజర్/ ఎలెక్టివ్‌‌‌‌‌‌‌‌గా చదివి హిందీ మాధ్యమంలో పరీక్షలు పూర్తి చేసి ఉండాలి.

ఓపెన్ యూనివర్సిటీలు, కరస్పాండెన్స్ లేదా దూరవిద్యా విధానంలో డిగ్రీ పొందిన అభ్యర్థులు అర్హులు కాదు. ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో ఇంగ్లిష్ నుంచి హిందీకి, అలాగే హిందీ నుంచి ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌కు రిపోర్టులు, పత్రాలు, లేఖలను అనువదించడంలో ఏడాది అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇది తప్పనిసరి కాదు. కంప్యూటర్ పరిజ్ఞానం, ఏఐ టూల్స్​పై అవగాహన ఉండాలి.

వయసు: 2026, సెప్టెంబర్ 1 నాటికి 23 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 23. 

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.1000 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 6.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్– ఐటమ్ రైటింగ్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్, గ్రూప్ ఎక్సర్ సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.ibps.inను సందర్శించండి.