న్యూఢిల్లీ: బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా.. ఆదివారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్ (సీవోఈ)కి వెళ్లనున్నాడు. అక్కడ జరుగుతున్న రిహాబిలిటేషన్ కార్యక్రమాలపై హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి సమీక్షించనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (మోకాలి వాపు), బి. సాయి సుదర్శన్ (ఎడమ కాలి బొటనవేలు), హర్షిత్ రాణా (తొడ కండరాలు), నితీష్ కుమార్ రెడ్డి (తొడ కండరాలు), వాషింగ్టన్ సుందర్ (పిక్క కండరాలు), ఆకాష్ దీప్ (నడుము కింది భాగంలో ఎముక పగులు) రకరకాల గాయాలతో ఇక్కడే రిహాబిలిటేషన్‌లో ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (కాలి పిక్క), వరుణ్ చక్రవర్తి (తొడ కండరాలు), ప్రిన్స్ యాదవ్ (తొడ కండరాలు) కూడా సీవోఈలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే, 2025 ప్రారంభంలో నితిన్ పటేల్ రాజీనామా చేసినప్పటి నుండి అక్కడ 'స్పోర్ట్స్ సైన్స్' విభాగానికి సరైన అధిపతి లేకపోవడంతో సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లందరినీ తిరిగి మైదానంలోకి తీసుకురావడమే ప్రధాన సవాలుగా మారింది.
