ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట లభించింది. సిటీలోని భూదాన్ భూముల్లో ఇండ్లను పోగొట్టుకున్న భాదితులకు ఇండ్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో 412 మందికి పట్టాలు ఇవ్వనున్నట్లు మంగళవారం (మార్చి 10) అధికారులు తెలిపారు.

భూదాన్ బాధితుల్లో ఇళ్ల స్థలాలు లేని 311 మందికి స్థలంలో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మరో101 మందికి వారి సొంత ఊరిలో స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సొంత స్థలాలు ఉండటంతో వారి ఊరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఆర్ధిక సహాయం చేయనున్నారు. 

ఇందులు భాగంగా మంగళవారం (మార్చి 10) ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రెవిన్యూ శాఖ అధ్వర్యంలో టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్లు అందుకున్న భూ భాదితులకు జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బుధవారం (మార్చి 11) పట్టాలు ఇవ్వనున్నారు. టోకెన్లు అందుకున్న భూ బాధితులు ప్రభుత్వానికి, జిల్లా మంత్రలకు కృతజ్ఞతలు తెలిపారు.