భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం దగ్గర గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. భద్రాచలం దగ్గరగ గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ (జులై 31, 2026) సాయంత్రానికి ఉధృతి మరింత అవకాశం ఉండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది.
50 అడుగుల వరకు చేరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి నది పరివాహక ప్రాంత లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక.. మహబూబ్ నగర్ జిల్లాలో కీలక ప్రాజెక్ట్ అయిన జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. జూరాల 17 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో: లక్ష 4 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 96 వేల క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం..317.59 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.817 టీఎంసీలు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
