వినాయక చవితి పూజలో జంటగా.. పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా?

వినాయక చవితి పూజలో జంటగా.. పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, గ్లామరస్ బ్యూటీ ఈషా రెబ్బా డేటింగ్ వార్తలు గత కొంతకాలంగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లు, వెకేషన్లలో కలిసి కనిపించడమే కాకుండా.. తరుణ్ తల్లితో కూడా ఈషా సందడి చేయడంతో వీరి ప్రేమాయణంపై రూమర్లు జోరందుకున్నాయి. తాము కేవలం 'బెస్ట్ ఫ్రెండ్స్' అని గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే టెస్ట్ గా చోటుచేసుకున్న ఓ సంఘటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈ రోజు ( సెప్టెంబర్ 14, 2026 ) వినాయక చవితి పండగను పురస్కరించుకుని తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఇంట్లో పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఇద్దరూ కలిసి దిగిన ఒక ప్రత్యేకమైన ఫొటోను తరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఎలాంటి క్యాప్షన్ లేకుండా షేర్ చేసిన ఈ ఒక్క ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా పిక్ షేర్ చేసి, తమ రిలేషన్‌షిప్‌పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.

ఈ పోస్ట్‌పై సినీ సెలబ్రిటీల కామెంట్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నటి కావ్య కళ్యాణ్ రామ్ 'ఈ ఫొటో చూస్తుంటే పండగ రోజు మంచి పులిహోర తిన్న ఫీల్ ఉంది' అంటూ సరదాగా కామెంట్ చేయగా.. మంచు లక్ష్మి, ప్రగతి, శివాత్మిక రాజశేఖర్, షాలిని కొండెపూడి వంటి ప్రముఖులు ఈ జంటకు 'కంగ్రాట్స్','ఆల్ ది బెస్ట్' అంటూ విషెస్ అందించడం హాట్ టాపిక్‌గా మారింది.

►ALSO READ | Naga Chaitanya: వరుస అవార్డులతో దూసుకెళ్తున్న నాగ చైతన్య.. ‘తండేల్’తో మూడోసారి బెస్ట్ యాక్టర్!

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తరుణ్ భాస్కర్.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పుడు పండగ వేళ ఈషా-తరుణ్ ఇలా జంటగా దర్శనమివ్వడం, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతుండటంతో వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ నుంచి అఫీషియల్ గుడ్ న్యూస్ రానుందని టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.