అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్యకు ఈ 2026 ఏడాది అవార్డుల పంట పండుతోంది. ఆయన హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. చైతూ నటనకు వరుసగా అవార్డులు తెచ్చిపెడుతోంది. తాజాగా ప్రతిష్టాత్మక SIIMA (South Indian International Movie Awards) వేదికపై నాగ చైతన్య మరోసారి ‘బెస్ట్ యాక్టర్’ అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో ‘తండేల్’ సినిమాకు గాను ఈ ఏడాది ఆయన అందుకున్న బెస్ట్ యాక్టర్ అవార్డుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, ఇండియన్ నేషనల్ సినిమా అకాడమీ (INCA) అవార్డుల్లోనూ బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన చైతన్య.. ఇప్పుడు SIIMA అవార్డుతో హ్యాట్రిక్ సాధించారు.
ఒకే ఏడాదిలో ‘తండేల్’ చిత్రానికి గాను మూడు బెస్ట్ యాక్టర్ అవార్డులను అందుకోవడంతో నాగ చైతన్య విజయ పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఆయన కెరీర్‌లో ‘తండేల్’ ప్రత్యేకంగా నిలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్’లో రాజు పాత్రకు లభిస్తున్న ఈ గుర్తింపు.. చైతన్య కెరీర్‌లో ఈ సినిమా ఎంత ప్రత్యేకమైనదో మరోసారి చాటిచెబుతోంది.
A special moment from a memorable journey.
— Annapurna Studios (@AnnapurnaStdios) September 14, 2026
Yuvasamrat @chay_akkineni with the SIIMA Best Actor award for #Thandel pic.twitter.com/n5c2kWg07f
చైతూ నటనకు జేజేలు..
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’లో నాగ చైతన్య.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రాజు పాత్రలో కనిపించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌లో చిక్కుకున్న మత్స్యకారుడిగా ఆయన చూపించిన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా పాత్ర కోసం చైతూ తన బాడీ లాంగ్వేజ్, యాస, లుక్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రేమ, దేశభక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ కథను తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Accolades and awards continue to pour in for @chay_akkineni
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) September 13, 2026
👉 Telangana Gaddar Award
👉INCA Best Actor Award
👉 #SIIMA2026
He bagged the Best Actor for #Thandel at @siima 👏
He made the hard yards for the film, and now getting the much needed appreciation 👏#NagaChaitanya pic.twitter.com/0vtskFRrWo
వృషకర్మ’పై భారీ బజ్..
ఇక నాగ చైతన్య తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటిస్తున్న ‘వృషకర్మ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది.
మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను కలగలిపి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. సినిమాలో నాగ చైతన్య ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనుండటం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చైతన్య తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసినట్లు తాజా సమాచారం. డిసెంబర్ 4, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరోవైపు బ్లాక్ బస్టర్ సీక్వేల్ ‘దూత’ షూటింగ్‌లోనూ నాగ చైతన్య ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
