రేపటి నుంచి ఆగస్టు నెల స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో పండుగలు, జాతీయ సెలవులు, వీకెండ్ సెలవులు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా వేర్వేరు రోజుల్లో మొత్తంగా 14 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల లిస్ట్ ప్రకారం... అన్ని ఆదివారాలు, అలాగే ప్రతి నెల వచ్చే రెండు, నాల్గవ శనివారాలతో పాటు ప్రాంతీయ పండుగలకు కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే బ్యాంకులు మూసి ఉన్న కూడా అత్యవసర లావాదేవీల కోసం ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ ఆగస్టు నెలలో బ్యాంకులు ఏ రోజుల్లో మూసి ఉంటాయంటే :
ఆగస్టు 2 (ఆదివారం): ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్.
ఆగస్టు 4 (మంగళవారం): 'కేర్ పూజ' సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు పనిచేయవు.
ఆగస్టు 8 (రెండవ శనివారం): రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అలాగే గాంగ్‌టక్‌లో 'టెండోంగ్ లో రమ్ ఫాత్' పండుగ కారణంగా బ్యాంకులు బంద్.
ఆగస్టు 9 (ఆదివారం): ఆదివారం సెలవు.
ఆగస్టు 13 (గురువారం): 'దేశభక్తి దినోత్సవం' సందర్భంగా ఇంఫాల్‌లోని బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 15 (శనివారం): 'స్వాతంత్ర దినోత్సవం' సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు జాతీయ సెలవు.
ఆగస్టు 16 (ఆదివారం): ఆదివారం సెలవు.
ఆగస్టు 19 (బుధవారం): 'మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం' సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఆగస్టు 22 (నాల్గవ శనివారం): నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 23 (ఆదివారం): ఆదివారం సెలవు.
ఆగస్టు 25 (మంగళవారం): 'మిలాద్-ఉన్-నబీ / మొదటి ఓనం' సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం సహా కొన్ని ఇతర రాష్ట్రలో బ్యాంకులు బంద్.
ఆగస్టు 26 (బుధవారం): 'ఈద్-ఇ-మిలాద్ / తిరువోణం' సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని ఇతర రాష్ట్రలో బ్యాంకులు బంద్.
ఆగస్టు 28 (శుక్రవారం): 'రక్షా బంధన్' ఇతర ప్రాంతీయ పండుగల కారణంగా అన్ని రాష్ట్రలో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 30 (ఆదివారం): ఆదివారం సెలవు.
గమనిక: కొన్ని సెలవులు కేవలం ఆ రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను బట్టి మారుతుంటాయి. కాబట్టి, మీరు మీ స్థానిక బ్యాంకు సెలవులను చూసుకోవడం మంచిది.
