పొగతాగితే క్యాన్సర్ వస్తుంది.. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన కామన్ పాయింట్. అయితే స్మోక్ చేయికపోయినా క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారి స్మోక్ అలవాటు లేని వాళ్లను సైతం వలదలనదని అంటున్నారు. లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులతో జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.
ఆగస్టు 1న ఊపిరితిత్తుల (లంగ్స్) క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా.. లంగ్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ.. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలపై మ్యాక్స్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. మనీష్ కుమార్ అగర్వాల్ హెచ్చరికలు సూచనలు.
సిగరెట్ తాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణమైనప్పటికీ, కాలుష్యం, సెకండ్‌హ్యాండ్ స్మోక్, ఇండోర్ టాక్సిన్స్, జన్యుపరమైన కారణాల వల్ల నాన్-స్మోకర్లు కూడా ఈ వ్యాధికి గురవుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయన తన క్లినిక్‌లో ఎదురైన ఒక కేసు గురించిన అనుభవాన్ని చెప్తూ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు.
మీరా (పేరు మార్చారు) అనే స్కూల్ టీచర్ జీవితంలో ఏనాడు సిగరెట్ తాగని వ్యక్తి. తనకు నిరంతరం దగ్గు వస్తుందని.. కాలుష్యం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేసింది. మూడు నెలల తర్వాత చేసిన సిటి స్కాన్‌లో లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నట్లు గుర్తించారు. సకాలంలో చికిత్స చేయడంతో ఆమె పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.
ఈ 5 అలవాట్లతో ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు:
ఇంట్లో స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోండి:
ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి, సెకండ్‌హ్యాండ్ స్మోక్‌ను నివారించండి. అంటే.. వేరే వాళ్లను తాగనివ్వకండి. మీరు తాగకపోయినా.. వేరే వాళ్లు తాగిన స్మోక్ పీల్చుకుంటే మీరు సెకండ్ హ్యాండ్ స్మోకర్ అయినట్లే. వంటగదిలో మంచి వెంటిలేషన్ ఉండేలా చూడండి. మస్కిటో రెపెల్లెంట్ కాయిల్స్, అధిక పొగ, పూజా గధిలో అధిక ధూపం, బయోమాస్ కాల్చడం వంటివి తగ్గించండి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు HEPA ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి.
AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ట్రాక్ చేయండి :
బయటకు వెళ్లేముందు గాలి నాణ్యతను టెస్ట్ చేయండి. AQI ఎక్కువగా ఉన్న రోజుల్లో వ్యాయామాలు ఇంట్లోనే చేయండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకండి. తప్పనిసరైతే సర్జికల్ లేదా N95 మాస్క్ ధరించండి.
ఊపిరితిత్తులను యాక్టి్వ్ గా ఉంచుకోండి:
అంటే తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదు. వారానికి 5 రోజులు 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయండి. సాధారణ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ (స్పైరోమెట్రీ) చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కన్సిస్టెన్సీ అవసరం.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఆహారం తీసుకోండి:
సీజనల్ పండ్లు (జామ, నారింజ, బొప్పాయి), ఆకు కూరలు (పాలకూర), నట్స్ (బాదం, వాల్‌నట్, ఫ్లాక్స్ సీడ్స్), ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోండి. ఇవి పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే సెల్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ను ఇగ్నోర్ చేయకండి
3 వారాలకు మించి కొనసాగే దగ్గు, ఊపిరి అడ్డుకోవడం, దగ్గినపుడు రక్తం పడటం, ఆకస్మిక బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. చాలా దగ్గులు క్యాన్సర్ కాకపోవచ్చు కానీ, త్వరగా పరీక్షించడం ద్వారా నిర్ధారించవచ్చు.
