జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది (2026) ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో శక్తివంతమైన గ్రహాలు వాటి స్థానాలు మారడం అత్యంత కీలకమవుతుందని పండితులు చెబుతున్నారు. . దీనికి తోడు ఆగస్టు 12న ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఏ గ్రహం ఎప్పుడు ఏ రాశిలోకి మారుతుంది. దానివలన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్టు నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వంటి కీలక గ్రహాల సంచారాలు, వాటి కలయికతో ఏర్పడే శుభ యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అనేక అంశాల్లో సానుకూల మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు లో గ్రహాల మార్పు వివరాలు
- ఆగస్టు 1 : కన్యా రాశిలోకి శుక్రుడు
- ఆగస్టు 2 : మిథున రాశిలోకి కుజుడు
- ఆగస్టు 12 : రెండో సూర్య గ్రహణం
- ఆగస్టు 17 :సింహరాశిలో కి సూర్యుడు
- ఆగస్టు 22 : సింహరాశిలోకి బుధుడు
కన్యా రాశిలోకి శుక్రుడు (ఆగస్టు 1) : ఆగస్టు నెల ప్రారంభంలో నే అంటే 1 వ తేదీన శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా కొందరి వ్యక్తిగత బంధాల విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఆర్థిక విషయాల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఫ్యాషన్, వినోదం, డిజైనింగ్, లగ్జరీ రంగాల్లో రాణించే వారికి ఎంతో లాభసాటిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మిథున రాశిలోకి కుజుడు ( ఆగస్టు 2): మిథున రాశిలో కుజుడు సంచారం సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం, ధనలాభం కలిగితే, మరికొన్ని రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాక్రమం.. ఆత్మవిశ్వాసానికి ప్రతీకైన కుజుడు స్థానం మారడం వలన ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. జాబ్ మారాలనుకొనే వారు ఇది సరైన సమయం. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా లాభాలు వస్తాయి.
రెండో సూర్య గ్రహణం ( ఆగస్టు 12) : రెండో సూర్యగ్రహణం ఏర్పడుతంది. అయితే ఇండియాలో కనపడదు కాబట్టి ఎలాంటి సూతకాలం నియమాలు పాటించనవసరం లేదని పండితులు చెబుతున్నారు. అయితే జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ కాలాన్ని పెద్ద మార్పులకు సంకేతంగా చూస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని, సంయమనం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
సింహరాశిలో కి సూర్యుడు (ఆగస్టు 17) : సూర్యుడు తన స్వరాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం వలన నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేషన్, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం స్వర్ణయుగమని పండితులు చెబుతున్నారు. కొంతమందికి ధైర్యం, పట్టుదల , లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఉన్నత పదవులలో ఉన్నవారికి అనుకూలమైన కాలమని పండితులు చెబుతున్నారు. .కీర్తి ప్రతిష్టలుసమాజంలో గౌరవం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సూర్యడు అగ్ని తత్వ గ్రహం కావడంతో కోపం, అహంభావం.. దూకుడు పెరిగే అవకాశం ఉండటం వలన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఓర్పు సహనం లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
సింహరాశిలోకి బుధుడు ( ఆగస్టు 22) : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశిలో బుధుడు సంచారం చాలామంది ఆలోచనల్లో స్పష్టత, ఆత్మవిశ్వాసం, మాటతీరు నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ చాలా శక్తివంతంగా మారుతుంది. మాటల్లో గర్వం, అహంకారి ధోరణి మరియు ఇతరులను ఆకట్టుకునే శక్తి పెరుగుతాయి. నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు అహంభావం కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావం కర్కాటక, సింహ, కన్యా రాశుల వారికి వృత్తిరీత్యా పురోగతి, ధనలాభం , శుభఫలితాలు కలుగుతాయి. మిథున, వృశ్చిక, మకర రాశుల వారు ఆర్థిక విషయాల్లో, పనిభారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
