ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి 69 అడుగుల ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. నది నుంచి తెచ్చిన 30 టన్నుల మట్టి, 20 టన్నుల ఇసుక, 25 టన్నులకు పైగా స్టీల్, 70 బండిళ్ల వరి గడ్డితో పర్యావరణహితంగా విగ్రహాన్ని రూపొందించారు.
జూన్ 25న కర్రపూజతో ప్రారంభమైన నిర్మాణ పనులు 80 రోజులపాటు సాగాయి. 150 మందికి పైగా కళాకారులు, కార్మికులు బడా గణేశుడి నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఈ మహా గణనాథుడి దర్శనం కోసం సోమవారం (సెప్టెంబర్ 14) నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
