హైదరాబాద్ అంతటా మట్టి గణపతులే... నిర్వాహకులు, సిటీ జనాల్లో పెరిగిన అవగాహన

హైదరాబాద్ అంతటా మట్టి గణపతులే... నిర్వాహకులు, సిటీ జనాల్లో పెరిగిన అవగాహన
  • నగర వ్యాప్తంగా 1.5 లక్షల వినాయక మండపాలు
  • ఇండ్లల్లోనూ కలిపితే లక్షల్లో మట్టి వినాయకుల ప్రతిష్ఠాపన 

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరం గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్సవాలకు ముస్తాబైంది. సోమవారం వినాయక చవితి సందర్భంగా నగరవ్యాప్తంగా సుమారు1.5 లక్షల గణేశుడి మండపాలు ఏర్పాటవుతున్నాయని భాగ్యనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్సవ సమితి ప్రకటించింది. గతేడాది 1.4 లక్షల మండపాలు ఏర్పాటు కాగా.. ఈ సారి ఆ సంఖ్య పెరిగిందని స్పష్టం చేసింది. 

అయితే, రాను రాను జనాలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండడంతో మట్టి విగ్రహాలే పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మండపాలతో పాటు ఇండ్లల్లో లక్షల్లో గణపతి మట్టివిగ్రహాలను ఏర్పాటు చేశారు.  

పెరిగిన ప్రాధాన్యత 

రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మట్టి విగ్రహాల తయారీ, ఏకో ఫ్రెండ్లీ వినాయకులపై అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ కల్పించారు.

 టీజీపీసీబీ 20 స్కూళ్లలో పిల్లలలో మట్టి వినాయకులను తయారు చేయించి వాటిని వారి ఇండ్లలో ప్రతిష్ఠించుకునేలా చూశారు. ప్రజల్లో కూడా చాలా వరకు అవగాహన వచ్చి తమ మండపాలతో పాటు ఇండ్లల్లో రంగు రంగుల గణపతికి బదులు మట్టి గణేశులకే ప్రాధాన్యత ఇచ్చారు. 

సుమారు 10 లక్షల మట్టి విగ్రహాలు.. 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ సంస్థలైన హెచ్ఎండీఏ , పీసీబీ, మూడు కార్పొరేషన్లు కలిపి కేవలం ఉచిత పంపిణీ కోసమే దాదాపు 7.5 లక్షలకు పైగా మట్టి వినాయక విగ్రహాలను రెడీ చేసి ఉచితంగా పంపిణీ చేశాయి. హెచ్​ఎండీఏ 34 ప్రధాన కేంద్రాల ద్వారా 1.33 లక్షలు, పీసీబీ టెంపుల్స్​తో పాటు కలెక్టరేట్ల ద్వారా 3.26 లక్షలు, మూడు కార్పొరేషన్లు లక్ష చొప్పున 3 లక్షల విగ్రహాలను వార్డు ఆఫీసులు, పార్కుల్లో అందుబాటులో ఉంచి పంపిణీ చేశాయి.

 అయితే, నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ఇండ్లలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలతో పాటు మండపాల్లో ప్రతిష్ఠించే భారీ మట్టి గణనాథుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంఖ్య 10 లక్షలు దాటి ఉంటుందనేది ఒక అంచనా. 

పెద్ద గణపతులూ మట్టితోనే.. 

 ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిష్ఠించిన 69 అడుగుల మహాగణపతితో పాటు నాగోల్​లో ప్రతిష్ఠించిన 72 అడుగుల భారీ వినాయకుడు కూడా పూర్తిగా పర్యావరణహిత మట్టితోనే రూపొందించడం విశేషం. అలాగే, సిటీలోని 4,500 కంటే ఎక్కువ కాలనీ అసోసియేషన్లు తమ పరిధిలో వంద శాతం మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేశాయి.