హైదరాబాద్ లో నాన్ స్టాప్ వర్షం కురుస్తోంది. 2026 సెప్టెంబర్ 14 తెల్లవారుజామున మొదలైన వాన.. విడువకుండా కురుస్తూనే ఉంది. దీంతో సీటీ మొత్తం జలమయం అయ్యింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, మణికొండ, షేక్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్, లక్డీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, హయత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. వాన రాకతో సిటీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు, పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. అనేక చోట్ల నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉదయం నుంచి కురిసిన ఈ వర్షం నగరవాసులకు ఉపశమనం కలిగించినా, లోతట్టు ప్రాంతాల్లో జలమయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు వినాయక చవితి కావడంతో తొలి పూజకు కాస్త ఆటంకం ఏర్పడింది. చవితి కోసం పూజా సామాగ్రిని అమ్ముకునే చిరు వ్యాపారులు వర్షంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పూజా కార్యక్రమాలు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి.
