హ్యాపీ గర్ల్ఫ్రెండ్ డే 2026: మీ గర్ల్ఫ్రెండ్ను ఇలా విష్ చేయండి.. టాప్ మెసేజెస్, కోట్స్

హ్యాపీ గర్ల్ఫ్రెండ్ డే 2026: మీ గర్ల్ఫ్రెండ్ను ఇలా విష్ చేయండి.. టాప్ మెసేజెస్, కోట్స్

ప్రేమికుల కోసం లవర్స్ డే, ప్రపోజ్ డే ఉన్నట్లుగానే గర్ల్ ఫ్రెండ్ డే కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీని గర్ల్‌ఫ్రెండ్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు తన ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తుంటారు. గిఫ్ట్స్, ట్రిప్స్, పార్టీస్ కు ముందు.. డే మారగానే చేయాల్సిన పని విష్ చేయడం. తన గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ మెసేజ్ లోనే ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తుంటారు బాయ్స్. అలాంటి వారికోసం బెస్ట్ మెసేజెస్, కోట్స్ ఇవ్వడం జరిగింది. 

 గర్ల్‌ఫ్రెండ్‌ దే రోజు.. తమలో ఉన్న ప్రేమను, ఇష్టాన్ని స్పెషల్ గా ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఒక అవకాశం. లవర్స్ మధ్య ఇంప్రెషన్స్, ఎక్స్ ప్రెషన్స్ కామన్ అయినప్పటికీ.. ఈ రోజు చెప్పేది ఆ ఇయర్ మొత్తం గుర్తుండిపోయే అంశం అందుకే.. గర్ల్ ఫ్రెండ్స్ డేకు పురుషులు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. 

గర్ల్‌ఫ్రెండ్ డే అంటే కేవలం ఒక రోజు కాదు. రోజంతా బిజీగా ఉన్నా, ఆమె కోసం కొన్ని మాటలు చెప్పడం ఎంతో ముఖ్యం. ప్రేమ, థ్యాంక్స్, ఫన్ నిండిన ఈ మెసేజ్‌లు మీ రిలేషన్ షిప్ ను మరింత దగ్గర చేస్తాయి.
ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న విషెస్, హార్ట్ టచింగ్ మెసేజెస్, ఫన్నీ కోట్స్‌ను ఇవ్వడం జరిగింది.  WhatsApp, Instagram లేదా కార్డ్స్  ద్వారా షేర్ చేసుకోవచ్చు.

టాప్ మెసేజెస్  అండ్ కోట్స్:

  • నాకు అన్నీ చెప్పాలనిపించే వ్యక్తికి హ్యాపీ గర్ల్‌ఫ్రెండ్ డే. ఎవరికి అర్థం కాకపోయినా.. నీకు మాత్రమే అర్థమయ్యే చిన్న చిన్న విషయాలు నా ఆనందాలు.
  • లవ్ మళ్లీ అంతా మొదటి నుంచి చేయాల్సి వచ్చినా... నా లవ్ గా నిన్నే ఎంచుకుంటాను. మన మధ్య జరిగే గొడవలు, వాదనలు ఏవైనా.. అవి నాకు తీపి గుర్తులే.
  • నీతో ఉన్నప్పుడు బోరింగ్ విషయాలు కూడా ఆనందంగా మారిపోతాయి.
  • నా వీక్ నెస్ అన్నీ తెలిసినా  నువ్వు ఇంకా నా పక్కనే ఉన్నావు చూడూ.. అదే నాన్ను నీకు కట్టిపడేలా చేసే విషయం. 
  • నువ్వు ఎప్పుడూ రైట్ అని చెప్పడం లేదు... కానీ దాదాపు ఎప్పుడూ రైటే!

గర్ల్‌ఫ్రెండ్ డేని స్పెషల్ గా చేసుకోవాలంటే గ్రాండ్ గిఫ్ట్స్ అవసరం లేదు. ఒక నిజాయితీతో కూడిన మెసేజ్, గుర్తుండిపోయే ఫోటో లేదా టైమ్ చాలు. మీ సొంత జ్ఞాపకాలను జోడించి పంపే మెసేజ్ మరింత స్పెషల్ గా ఉంటుంది.

హ్యాపీ గర్ల్‌ఫ్రెండ్ డే 2026!