సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 2 నుంచి 4 వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
మహంకాళి ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పొగాకు బజార్, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్ రహదారులతో పాటు జనరల్ బజార్ - మహంకాళి ఆలయ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గాల్లో ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశారు.
భక్తుల సౌకర్యార్థం హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, వెస్లీ కాలేజ్, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ వంటి ప్రాంతాల్లో మొత్తం 14 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని, ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
డైవర్షన్స్,మళ్లింపు ఇలా
- ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గాల్లో ప్రత్యేక డైవర్షన్లు
- ప్యాట్నీ–ట్యాంక్‌బండ్ వాహనాలకు ప్యారడైజ్, క్లాక్ టవర్ మీదుగా మళ్లింపు
- ప్యారడైజ్–బైబిల్ హౌస్ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్
- క్లాక్ టవర్–ఆర్‌పీ రోడ్ వాహనాలు ఎస్‌బీఐ, రాణిగంజ్ వైపు మళ్లింపు
- ఘాస్‌మండి, బైబిల్ హౌస్, కర్బాలా వద్ద ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు
- ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్, బేగంపేట్ వైపు మీదగా వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు
- ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్ వెళ్లే వాహనాలకు సింధీ కాలనీ మీదుగా డైవర్షన్
- ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసుల సూచన
- ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఫాలో కావాలని విజ్ఞప్తి
