సూరత్: గుజరాత్లోని సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూరత్లోని సచిన్ GIDC ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పేపర్ మిల్లులో బుధవారం మధ్యాహ్నం భారీగా మంటలు రేగాయి. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడం కోసం 10 ఫైర్ ఇంజన్లతో ప్రయత్నం చేస్తున్నారు.
సచిన్ GIDCలో ఉన్న ఈ ప్రైవేట్ పేపర్ మిల్లులో పెద్ద మొత్తంలో రసాయనాలు నిల్వ చేశారు. మంటలు చెలరేగిన తర్వాత, రసాయనాల కారణంగా ఒకటికి 30కి పైగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు శబ్దం చాలా దూరం వినిపించింది.
ఈ మంటలు, శబ్దాల కారణంగా దగ్గరలోని ఇతర కంపెనీలలో పనిచేసే కార్మికులు కూడా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలు నెలకొన్నాయి. పేపర్ మిల్లులో పెద్ద మొత్తంలో కాగితం ఉండటం వల్ల, మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అందువల్లే మంటలను అదుపులోకి తీసుకురావడం కష్టమవుతుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | Gujarat | Fire breaks out at a chemicals factory in Surat's Sachin GIDC area. More than 10 fire engines have arrived to extinguish the blaze. Efforts are underway to bring the fire under control. pic.twitter.com/BkMA2BDIpZ
— ANI (@ANI) March 11, 2026
