FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11న మొదలై జులై 19వ తేదీతో ముగియనుంది. ఈ మెగా టోర్నమెంట్ సుమారు 39 రోజుల పాటు యూఎస్, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆథిత్యం ఇస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ లో ఇప్పటి వరకు కేవలం 32 దేశాలే పాల్గొంటుండగా.. ఈసారి ఏకంగా 48 దేశాలు పోటీ పడుతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్ లను నిర్వహించనున్నారు. కాగా తొలి మ్యాచ్ జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ మెక్సికో వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరగనుంది.
ఫిఫా వరల్డ్ కప్ లో ఇరాన్ జట్టు:
వచ్చే ఫిఫా వరల్డ్ కప్ 2026 (యూఎస్, మెక్సికో, కెనడా)లో ఇరాన్ జట్టు పాల్గొనే అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం యూఎస్– -ఇజ్రాయిల్–-ఇరాన్ యుద్ధ పరిస్థితులు కారణంగా ఇరాన్ ఫుట్‌బాల్ బాయ్‌కాట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇంఫాంటినో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయ్యారు. ట్రంప్– ఇరాన్ జట్టు అన్ని మ్యాచ్‌లలో పాల్గొనడానికి సానుకూలంగా ఉన్నారని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇంఫాంటినో తెలిపారు. ఇరాన్ జట్టు యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొనడానికి స్వాగతం పలుకున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచానికి ఇలాంటి ఫుట్‌బాల్ వల్డ్ కప్ లాంటి ఈవెంట్ అవసరం ఉంది.. ఇది అన్ని దేశాల ప్రజలను ఒకే వేదికపై అందరిని కలిపే అవకాశం ఇస్తుందని చెప్పారు. అధ్యక్షుడి ట్రంప్ మద్దతుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఫిఫా వరల్డ్ కప్ అధ్యక్షుడు తెలిపారు.
టోర్నీ నుంచి ఇరాన్ తప్పుకునే ఛాన్స్?:
ఇరాన్ తమ ఆసియా క్వాలిఫైయింగ్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచినందున ఫిఫా వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది. జట్టు గ్రూప్– Gలో న్యూజిలాండ్, ఈజిప్టు, బెల్జియం జట్లతో పోటీ పడుతుంది. అయితే, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ తో -ఇరాన్ యుద్ధం చేస్తుండటంతో.. ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు ఈ ఫిఫా వరల్డ్ కప్ ని బాయ్‌కాట్ చేసే ఆవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక వేళా ఇరాన్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే ఆ తర్వాత ఏం చేయాలనే యోచనలో ఫిఫా యాజమాన్యం ఉంది.
►ALSO READ | Shivam Dube: ఏంటి దూబే బ్రో.. రైలులో దాక్కుని వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?
ఇరాన్ బాయ్‌కాట్ చేస్తే ఏమైతుంది?:
ఇరాన్ ముందస్తుగా టోర్నమెంట్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయిస్తే, ఫిఫా కౌన్సిల్ ప్రత్యామ్నాయ జట్టును ఆహ్వానించవచ్చు.. ఈ జట్టు అదే కాంటినెంట్ (AFC) నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఇరాక్, UAE జట్లు ఇరాన్ బాయ్‌కాట్ ద్వారా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఇరాక్ AFC ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్‌లో పాల్గొంటుంది. ఇరాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి మొదటి అర్హత ఉన్న టీమ్ ఇదే. ఇరాక్ ప్లే ఆఫ్‌లో గెలిస్తే, UAE కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయ జట్టుగా నిలుస్తుంది. ఎందుకంటే వారు ఇరాక్‌పై ఓడిపోయి క్వాలిఫికేషన్‌ను మిస్ అయ్యారు కాబట్టి.
