మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' . ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలోని అత్యంత ఆసక్తికరమైన 'మెగా-విక్టరీ మాస్ సాంగ్' (Mega-Victory Mass Song) కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ను పంచుకున్నారు. రేపు (శుక్రవారం) ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఒకే ఫ్రేమ్‌లో చిరు, వెంకీ
ఈ సినిమాలో అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ ఈ మాస్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోతున్నారు. 'మెగా-విక్టరీ' కాంబో ఒకే పాటలో కనిపించబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అనిల్ రావిపూడి తన గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' తరహాలోనే, ఈ సినిమాలో కూడా వినోదానికి తోడుగా అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్‌ను జోడించినట్లు తెలుస్తోంది.
జనవరి 12న గ్రాండ్ రిలీజ్
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 'మీసాల పిల్ల', 'శశిరేఖ' పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
►ALSO READ | Google Search 2025: గూగుల్ సెర్చ్‌లో టాలీవుడ్ రారాజు ఏవరు?.. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్‌ల స్థానం ఎక్కడ?
హై-వోల్టేజ్ ఎంటర్టైనర్
మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సెసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వండర్ మూవీలో మెగాస్టార్ ఒక ఎన్.ఐ.ఏ (NIA) ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ యాక్షన్ మిళితమైన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు రాబోయే ఆ 'మాస్ సాంగ్' అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 'తగ్గేదే లే' అన్నట్లుగా ఈ సంక్రాంతిని మెగాస్టార్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు.
Team #ManaShankaraVaraPrasadGaru wishes you all a joyful #MerryChristmas ❤️🔥
— Shine Screens (@Shine_Screens) December 25, 2025
Brace yourself for the #MegaVictoryMass SONG UPDATE TOMORROW🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 💥
Megastar @KChiruTweets
Victory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/xKBmGmadnc
