కలియుగ వైకుంఠం తిరుమల సహా టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసివేయనున్నారు. మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసివేయనున్నట్లు తెలిపారు అధికారులు.
ఇందులో భాగంగా తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌లో ఉన్న ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, అలాగే శ్రీనివాసం మరియు విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు అధికారులు.
►ALSO READ | మార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత అన్నప్రసాద వితరణ కేంద్రాలు తిరిగి తెరుచుకుంటాయని తెలిపారు అధికారులు.
