మార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తా: సీఎం చంద్రబాబు

మార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తా: సీఎం చంద్రబాబు

మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని.. పూర్తి చేసే అవకాశం కూడా తనకే వచ్చిందని అన్నారు. రైతులను పండ్ల తోటలు పెట్టేలా ప్రోత్సహిస్తామని... మార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తానని అన్నారు చంద్రబాబు.

రాయలసీమలో హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని.. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తానని అన్నారు చంద్రబాబు. రూ. 13 వందల కోట్లతో మార్కాపురం జిల్లాలో ప్రతి ఇంటికి నీళ్ల కొళాయి ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మేలు చేసేందుకే పవన్ కళ్యాణ్, తాను కలిశామని.. రాష్ట్రానికి పునర్వైభవం రావాలంటే అందరూ సహకరించాలని అన్నారు.

►ALSO READ | అమరావతి నిజమైన అభివృద్ధి చెందాలంటే.. వందేండ్లైనా పడుతుంది

అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూటమిదే హవా అని.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు,మార్కాపురంలో వందశాతం స్ట్రైక్ రేట్ ఇవ్వాలని అన్నారు.మార్కాపురం జిల్లా చేస్తానని హామీ ఇచ్చామని.. మాట నిలబెట్టుకున్నానని అన్నారు. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పామని.. మాట నిలబెట్టుకున్నానని అన్నారు చంద్రబాబు.