ఖమ్మం జిల్లా వైరా RTC బస్టాండ్ దగ్గర మద్యం మత్తులో వివాహిత.. ఇద్దరు పిల్లలను వదిలేసి ఏం పనిది..!

ఖమ్మం జిల్లా వైరా RTC బస్టాండ్ దగ్గర మద్యం మత్తులో వివాహిత.. ఇద్దరు పిల్లలను వదిలేసి ఏం పనిది..!

వైరా: ఖమ్మం జిల్లా వైరా RTC బస్టాండ్ దగ్గర వివాహిత మద్యం మత్తులో కనిపించింది. ఇద్దరు పిల్లలను వదిలేసి మద్యం సేవించి సోయి లేకుండా కిందపడి దొర్లుతున్న స్థితిలో ఉన్న ఆ మహిళను చూసి స్థానికులు అసహ్యించుకున్నారు. ఇద్దరు పిల్లలను అలా వదిలేసి మద్యం తాగి పడి దొర్లడం ఏంటని ఆమెపై మండిపడ్డారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు.

తల్లాడ మండలంలోని అంజనాపురం అత్తమామల ఊరు. ఆకలితో ఉన్న పిల్లలను పట్టించుకోకుండా మద్యం సేవించి చిందులు వేస్తున్న ఆ యువతిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలకు తినుబండారాలు కొనిచ్చి పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఆమెను చూసి తోటి మహిళలు అసహ్యించుకున్నారు.

►ALSO READ | ఒడిషాలో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికే సహా ఆరుగురు మృతి