భద్రాచలంలో భక్తుల కోసం సమాచార కేంద్రం.. స్వామి దర్శనానికి ఇబ్బంది పడకుండా చర్యలు

భద్రాచలంలో భక్తుల కోసం సమాచార కేంద్రం.. స్వామి దర్శనానికి ఇబ్బంది పడకుండా చర్యలు

భద్రాచలం, వెలుగు : భక్తుల కోసం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని మిథిలాస్టేడియం పక్కన శుక్రవారం నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రూ.200 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణ పనులు ప్రారంభించగా, కూల్చివేతలు జరుగుతున్నాయి.

 భక్తులు దర్శనానికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు వారి సౌకర్యార్ధం ఈ కేంద్రంను ఏర్పాటు చేసినట్లుగా ఈవో దామోదర్​రావు తెలిపారు. వివిధ సేవల టిక్కెట్లు కూడా ఇక్కడే భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఏఈవోలు శ్రావణ్​కుమార్, భవానీ రామకృష్ణ పాల్గొన్నారు.