దోహా: ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ గురువారం మొదలవనుంది. ఈ మెగా టోర్నీలో ఇండియా నుంచి వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, విమెన్స్‌లో డిఫెండింగ్ చాంప్ కోనేరు హంపి ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.
ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన గుకేశ్ ఈ టోర్నీ విజయంతో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తుండగా, హంపి తన టైటిల్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతో ఉంది. వీరితో పాటు ప్రజ్ఞానంద, ఎరిగైసి అర్జున్ , దివ్య దేశ్‌ముఖ్ వంటి యంగ్ స్టర్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక, వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) ఓపెన్ సెక్షన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
