లవర్తో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని.. పోలీస్ స్టేషన్కు కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా

లవర్తో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని.. పోలీస్ స్టేషన్కు కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా

2024 కుంభమేళా సమయంలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయి.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న మోనాలిసా భోస్లే కేరళ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఒక మలయాళం సినిమాలో నటిస్తూ తిరువనంతపురంలో ఉన్న ఆమె తన ప్రియుడితో కలిసి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మోనాలిసా తన తండ్రిపై ఫిర్యాదు చేసింది. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదు చేసింది.

మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసాకు ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. అయితే.. మతాంతర వివాహానికి మోనాలిసా తండ్రి ఒప్పకోలేదు. ఆమె ప్రేమ విషయం తెలిసి అప్పటి నుంచి మోనాలిసాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మోనాలిసాపై ఒత్తిడి చేస్తుండటంతో ఆమె తన ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

►ALSO READ | RGV: 'ధురంధర్ 2' దాటికి సౌత్ సినిమాలు ఖాళీ? ఆర్జీవీ షాకింగ్ అనాలిసిస్!

కేరళకు తన తండ్రితో పాటే మోనాలిసా షూటింగ్కు వెళ్లింది. పెళ్లి గురించి తన తండ్రి ఒత్తిడి చేయడంతో తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అతను కూడా కేరళకు వెళ్లాడు. బుధవారం ఉదయం మోనాలిసా, ఆమె లవర్ కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కానీ.. మోనాలిసా తండ్రిని పిలిపించి మాట్లాడారు. 

మోనాలిసాకు 18 సంవత్సరాలు నిండాయని, ఆమె మేజర్ అని.. ఎవరిని వివాహం చేసుకోవాలనే విషయం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం అని ఆమె తండ్రికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోమని చెప్పే హక్కు ఎవరికీ లేదని పోలీసులు ఆమె తండ్రికి స్పష్టం చేశారు. పెళ్లి విషయంలో ఆమెకు ఇష్టం లేకుండా.. ఆమెపై ఒత్తిడి తీసుకురావడం చట్ట రీత్యా నేరం అని పోలీసులకు మోనాలిసా తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చి ముగ్గురినీ అక్కడ నుంచి పంపించేశారు.