RGV: 'ధురంధర్ 2' దాటికి సౌత్ సినిమాలు ఖాళీ? ఆర్జీవీ షాకింగ్ అనాలిసిస్!

RGV: 'ధురంధర్ 2' దాటికి సౌత్ సినిమాలు ఖాళీ? ఆర్జీవీ షాకింగ్ అనాలిసిస్!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్' మానియానే కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు అందరి కళ్లు మార్చి 19న విడుదల కానున్న సీక్వెల్ 'ధురంధర్ 2: ద రివెంజ్' పైనే ఉన్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

సౌత్ సినిమాలకు ముప్పు తప్పదా?

రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ధురంధర్ 2' గనుక బాక్సాఫీస్ వద్ద రూ.1500 నుంచి రూ.2000 కోట్లు రాబడితే, ఇక సౌత్ సినిమాల పని అయిపోయినట్లే అని అన్నారు. ఇప్పటికీ సౌత్ సినిమాలు పాత పద్ధతుల్లోనే సాగుతున్నాయి. కానీ ఆదిత్య ధర్ బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫీ భాషనే మార్చేశారు. గాలిలో ఎగురుతూ తన్నే ఫైట్లు కాకుండా, రియలిస్టిక్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించారు అని పేర్కొన్నారు.'బాహుబలి' తరహాలోనే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకుందని అద్భుతమైన బిజినెస్ చేస్తుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలో భారీగా ప్రమోట్ చేస్తున్నారని అన్నారు.

రణవీర్ సింగ్ వర్సెస్ పవన్ కళ్యాణ్!

'ధురంధర్ 2' విడుదలకు సిద్ధమవుతున్న వేళ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు నెలకొంది. తొలుత యష్ నటించిన 'టాక్సిక్'తో ఈ సినిమా పోటీ పడాల్సి ఉండగా, ఆ సినిమా వాయిదా పడటంతో ముప్పు తప్పింది అనుకున్నారు. కానీ, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నాయి. ఒకవైపు బాలీవుడ్ స్పై థ్రిల్లర్, మరోవైపు తెలుగు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఈ రెండింటిలో బాక్సాఫీస్ విజేత ఎవరనేది ఉత్కంఠగా మారింది.

►ALSO READ | మెగా మాతృమూర్తి అంజనాదేవికి 'బాపు బొమ్మ' పురస్కారం..

భారీ అంచనాలు!

రణవీర్ సింగ్ ఇందులో హమ్జా (జస్కీరత్) అనే ఇండియన్ స్పైగా కనిపిస్తున్నారు. ఆయనతో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్‌ను చూసి ఆర్జీవీ ఫిదా అయిపోయారు. ఇది అద్భుతం.. ఆదిత్య ధర్ తన రివెంజ్‌తో విరుచుకుపడుతున్నారు అని సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటుందా? వర్మ చెప్పినట్లు సౌత్ సినిమాల హవాకు 'ధురంధర్ 2' అడ్డుకట్ట వేస్తుందా? తెలియాలంటే మార్చి 19 వరకు వేచి చూడాల్సిందే మరి!