హన్సికకు విడాకులు మంజూరు.. ఎలాంటి భరణం ఆశించని ‘దేశ ముదురు’ హీరోయిన్

హన్సికకు విడాకులు మంజూరు.. ఎలాంటి భరణం ఆశించని ‘దేశ ముదురు’ హీరోయిన్

‘దేశ ముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హన్సిక మోత్వానీ నాలుగేళ్ల తన వైవాహిక బంధానికి ముగింపు పలికింది. ఆమె తన భర్త, వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. 

పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని, విడాకులు మంజూరు చేయాలని బాంద్రా ఫ్యామిలీ కోర్టును హన్సిక ఆశ్రయించింది. భర్త నుంచి ఎలాంటి భరణం ఆశించకుండానే హన్సిక విడాకులు కోరడం గమనార్హం. ఆమె తరపున అడ్వకేట్ అధాన్ షేక్ వాదనలు వినిపించారు. పెళ్లైన కొన్నాళ్లు మాత్రమే ఈ ఇద్దరూ కలిసి ఉన్నారని.. ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా ఎవరికి వారు విడిగా జీవిస్తున్నారని ఫ్యామిలీ కోర్టుకు ఆమె తరపు అడ్వకేట్ తెలిపారు.

►ALSO READ | లవర్తో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని.. పోలీస్ స్టేషన్కు కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా

చిన్నచిన్న విషయాలకే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో కలిసి జీవించడం కష్టమని నిర్ణయించుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారని పిటిషన్లో హన్సిక తరపు అడ్వకేట్ న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబర్ 4, 2022 హన్సిక, ఖతూరియా వివాహం జరిగింది. జులై 2, 2024 నుంచి ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మంచి హిట్లు, సూపర్ హిట్లు కూడా అందుకుంది.