జర్మనీలో ఈవెంట్ జరుగుతుండగా పబ్లిక్పై కాల్పులు.. ఐదుగురు స్పాట్ డెడ్

జర్మనీలో ఈవెంట్ జరుగుతుండగా పబ్లిక్పై కాల్పులు.. ఐదుగురు స్పాట్ డెడ్

జర్మనీలో మాస్ షూటింగ్ కు పాల్పడ్డారు దుండగులు. సోమవారం (జూన్ 29) ఉత్తర జర్మనీలోని  స్టాడే  సిటీలో జరిగిన సామూహిక కాల్పులలో  ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఒక గన్ మెన్ తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఒక యూత్ ఫెసిలిటీ సెంటర్ సమీపంలో (యువజన కేంద్రం) కాల్పులు జరిగాయి. నిందితులను పట్టుకునేందకు  భారీస్థాయి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో నిర్వాహకులు, పార్టిసిపెంట్స్  ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, దానికి దూరంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. 

యూత్ ఫెసిలిటీ కేంద్రంలో పలువురు బాధితులు హత్యకు గురయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారని  సిటీ పోలీసులు తెలిపారు.  జర్మనీ హాంబర్గ్‌కు పశ్చిమాన ఉన్న స్టేడ్‌ సిటీలో సుమారు 50 వేల మంది జనాభా ఉంటారు. 

►ALSO READ | పాకిస్తాన్‌లో దిగ్గజ న్యూస్ ఛానెల్‌పై నిషేధం: ఆ ఒక్క మొహర్రం ప్రోగ్రామ్‌తో సీన్ రివర్స్

అమెరికాతో పోలిస్తే జర్మనీలో తుపాకీ చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి.  ఇలాంటి మాస్ షూటింగ్ ఘటనలు కూడా తక్కువగా జరుగుతాయి. 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మానసిక వైద్య (మెంటల్ హెల్త్) పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. 

2023 మార్చిలో కూడా జర్మనీలో సామూహిక కాల్పుల ఘటన జరిగింది.  యెహోవాసాక్షుల సంఘం నుండి అసంతృప్తితో ఉన్న ఒక మాజీ సభ్యుడు, హాంబర్గ్‌లోని తమ క్రైస్తవ సంఘానికి చెందిన ఆరుగురిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు.