KGF రికార్డ్ బద్దలు కొట్టిన బెల్లంకొండ.. 100 కోట్ల వ్యూస్‌తో 'జయ జానకి నాయక' సంచలన రికార్డ్!

KGF రికార్డ్ బద్దలు కొట్టిన బెల్లంకొండ.. 100 కోట్ల వ్యూస్‌తో 'జయ జానకి నాయక' సంచలన రికార్డ్!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరికొత్త రికార్డు సృష్టించారు.  దక్షిణాదిలో ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జయ జానకి నాయక' (Jaya Janaki Nayaka) చరిత్ర సృష్టించింది. వరుస అపజయాలతో నిరాశలో ఉన్న బెల్లంకొండకు ఇది జోష్ ను నింపింది.

2017లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎవరూ ఊహించని రేంజ్‌లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ మైలురాయిని అధిగమించి సంచలనం రేపింది. ఈ చిత్రాన్ని హిందీలో 'ఖూన్‌ఖార్' (Khoonkhar) పేరుతో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియా మాస్ ఆడియన్స్‌కు ఈ మూవీ నెక్ట్స్ లెవెల్‌లో కనెక్ట్ అయింది.

 దాంతో, యూట్యూబ్‌లో ఒక ఫుల్ లెంత్ ఇండియన్ మూవీకి 100 కోట్ల వీక్షణలు రావడం ఇదే తొలిసారి. సాక్షాత్తూ గ్లోబల్ సెన్సేషన్ 'KGF: Chapter 1' హిందీ వెర్షన్ 861 మిలియన్ల వ్యూస్రికార్డును సైతం బెల్లంకొండ బద్దలు కొట్టారు.  యూట్యూబ్‌లో రిలీజై దాదాపు ఏడేళ్లు అవుతున్నా ఈ క్రేజ్ తగ్గలేదు. ఇటీవల ఈ సినిమాలోని ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్ సీక్వెన్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో విపరీతంగా వైరల్ కావడంతో, నార్త్ ఆడియన్స్ మళ్లీ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. 

►ALSO READ | Kangana Ranaut: కిస్ సీన్‌లో రక్తం వచ్చేలా హీరో పెదవులు కొరికానా? వైరల్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ రియాక్షన్!

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్ విలక్షణ పాత్రలు పోషించారు. థియేటర్లలో ఒక మోస్తారు హిట్‌గా నిలిచిన 'జయ జానకి నాయక'..  హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో మాత్రం బెల్లంకొండను 'యూట్యూబ్ కింగ్'గా నిలబెట్టింది. ఈ రేర్ ఫీట్‌తో సోషల్ మీడియాలో బెల్లంకొండ పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది