ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. ఫస్ట్ మ్యాచ్ ఈ జట్ల మధ్యే

ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. ఫస్ట్ మ్యాచ్ ఈ జట్ల మధ్యే

IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు ( మార్చి 11న) ప్రకటించింది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్‌లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో తలపడనుంది. మార్చి 28వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమవుతుంది.

ఇక ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫస్ట్ మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుండగా.. ఈ మ్యాచ్ గౌహాతిలో జరుగనుంది. కాగా గత సీజన్ ఫైనలిస్ట్ అయిన పంజాబ్ కింగ్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్‌పూర్‌ వేదికగా జరగనుంది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్ నుంచే అభిమానులకు ఉత్కంఠభరితమైన పోటీలు కనిపించనున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ టోర్నీకి సంబంధించి మిగతా పూర్తి షెడ్యూల్‌ను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.  

►ALSO READ | Team India Next T20 Captain: టీమిండియా నెక్ట్స్ టీ20 కెప్టెన్గా సంజు శాంసన్..