Team India Next T20 Captain: టీమిండియా నెక్ట్స్ టీ20 కెప్టెన్గా సంజు శాంసన్..

Team India Next T20 Captain: టీమిండియా నెక్ట్స్ టీ20 కెప్టెన్గా సంజు శాంసన్..

Team India Next T20 Captain: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఇప్పటి వరకు మూడు సార్లు టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న తొలి జట్టుగా ఇండియ నిలవగా.. సొంతగడ్డపై ట్రోఫీ నెగ్గిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. 2024 ప్రపంచకప్ ట్రోఫీ కైవసం చేసుకున్న తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు రిటైర్‌మెంట్ ఇవ్వగా,, యువ జట్టు ఎలా ఆడుతుందోనని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అవన్నీ ఫటాపంచల్ చేస్తూ 2026 విశ్వవిజేతగా అవతరించింది. రోహిత్ శర్మ నుంచి టీ20 పగ్గాలు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోని సారథిగా నిలిచాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కాగా భారత జట్టు భవిష్యత్ కెప్టెన్ గురించి ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ చర్చలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం సూర్యకి 35 ఏళ్లు కాగా.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, వచ్చే వరల్డ్ కప్ (2028) నాటికి అతడికి 37 ఏళ్లు వస్తాయి. కాబట్టి, టీమ్‌లో ఉన్నప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం కొనసాగుతాడా లేదా అనేది డౌటే. 

ప్రస్తుతం ఉన్న జట్టులో కెప్టెన్సీ రేసులో చాలామంది ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి వరుసలో మాత్రం సంజూ శాంసన్ పేరు ఉంది. వరల్డ్ కప్ లో చివరి మూడు మ్యాచ్ లలో చేసిన​అద్బుత ప్రదర్శన చేసి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం అతడికి ఉంది. జట్టులోని సీనియర్ ప్లేయర్ కావడంతో సూర్యకు సరైన వారసుడిగా సంజూనే అని పలువురు మాజీలు విశ్లేషిస్తున్నారు. 

►ALSO READ | MS Dhoni: CSKలోకి సంజు శాంసన్ ఏంట్రీ.. ధోనీ ఆడటంపై అనుమానాలు.. సీఈవో ఏమ‌న్నారంటే!

కొత్త కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. టీ20 జట్టు సారథిగా సంజూ శాంసన్ మంచి ఎంపిక అన్నారు. సంజూకు కెప్టెన్‌ ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి.. క్లిష్ట సమయాల్లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా నిర్ణయాలు తీసుకునే సత్తా అతడికి ఉందన్నారు. సూర్యకుమార్ తరువాత కొత్త కెప్టెన్ ఎవరు అని ఇప్పుడే చెప్పడం చాలా కష్టం.. సంజూ మాత్రం ముందు వరుసలో ఉంటాడని పేర్కొన్నాడు. కెప్టెన్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అయి ఉండాలని.. బౌలింగ్‌లో మార్పులు.. సరైన ఆటగాళ్లను తుది జట్టులో ఆడించడం.. ఫామ్‌లో లేని వాళ్లకు సపోర్టు చేయడం ఆటలో భాగమని కెప్టెన్‌గా తెలిసిన వ్యక్తి ఉండాలన్నాడు.

శాంసన్ కచ్చితంగా కెప్టెన్సీ రేసులో ఉంటాడని నేను భావిస్తున్నాను అని కైఫ్ పేర్కొన్నారు. సూర్యకుమార్ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే.. ఆ స్థానాన్ని భర్తీ చేయగలడు వ్యక్తి సంజునే.. ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రాజస్థాన్ రాయల్స్‌ను 2022 ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అతడి వయస్సు కేవలం 31 ఏళ్లు మాత్రమే.. కాబట్టి, టీమిండియా తదుపరి కెప్టెన్ కావొచ్చని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న వారిలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి.. తీసేశారు. వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ లు చాలా తక్కువగా ఉన్నాయి. మిగిలిన వారందరితో పోల్చితే, సంజూనే ది బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడని ఇతర మాజీ ఆటగాళ్లు వెల్లడిస్తున్నారు.