MS Dhoni: CSKలోకి సంజు శాంసన్ ఎంట్రీ.. ధోనీ ఆడటంపై అనుమానాలు.. సీఈవో ఏమ‌న్నారంటే!

MS Dhoni: CSKలోకి సంజు శాంసన్ ఎంట్రీ.. ధోనీ ఆడటంపై అనుమానాలు.. సీఈవో ఏమ‌న్నారంటే!

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2026 19వ సీజన్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్ క్యాంపులను ప్రారంభించాయి.  దీంతో గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో టోర్నీని ముగించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈసారి జట్టులో భారీ మార్పులు చేసింది. దీంతో టీమ్ లోకి కొత్తగా సంజు శాంసన్ తో పాటు యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే జట్టులోకి సంజు ఎంట్రీ ఇవ్వడంతో.. వయసు కారణంగా ఎంఎస్ ధోనీ అన్ని మ్యాచ్‌లలో ఆడగలరా అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.. ఆయన బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. 

ధోనీ ఆడటంపై సీఈవో క్లారిటీ: 
మహేంద్ర సింగ్ ధోనీ ఆడటంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌లలో ధోనీ ఆడే అవకాశం ఉందని తెలిపారు. ఆయన జట్టులో ఏ పొజిషన్ లో ఆడతారన్నది టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. జట్టు కోచింగ్ సిబ్బంది నిర్ణయం మేరకు ఆయన బ్యాట్స్‌మన్‌గా ఆడతారా, వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తారా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని వెల్లడించారు. 

►ALSO READ | Abhishek Sharma: వరుసగా 0,0,0.. కట్ చేస్తే ఐసీసీ నెంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ శర్మ

చెన్నైలోనే సీఎస్కే హోమ్ మ్యాచ్‌లు: 
ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో షెడ్యూల్ ప్రకటన కొంత ఆలస్యమైంది. మా హోమ్ మ్యాచ్‌లు అన్నీ తమిళనాడులోనే జరుగుతాయి.. షెడ్యూల్‌ను BCCI ప్రకటించేందుకు మేము వేచి చూస్తున్నామని చెప్పారు. ఇక టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడం పట్ల కూడా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎస్కే ఆటగాళ్లు సంజు శాంసన్, శివమ్ దూబే టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేశారని పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్ క్యాంప్ సజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.