మిన్నెసోటా: వ్యర్థాలుగా పారవేసే వేరుశెనగ (పల్లీ) పొట్టుతో పండ్లు, కూరగాయలపై ఉండే హానికరమైన పురుగుమందుల అవశేషాలను తొలగించే వినూత్న పద్ధతిని 13 ఏండ్ల బాలిక కనిపెట్టింది. అమెరికాలోని మిన్నెసోటాలో ఏడో తరగతి చదువుతున్న అరికా కుందు రూపొందించిన ‘లిగ్నెక్స్’ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మక ‘2026 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’ ఫైనల్స్‌కు ఎంపికైంది.
వేరుశెనగ పొట్టులో పురుగుమందుల అణువులను బంధించే సహజ గుణాలు ఉన్నట్లు ఆమె గుర్తించింది. పల్లీ పొట్టును పొడి చేసి ఎసిటిక్ ఆమ్లంతో శుద్ధి చేయడం ద్వారా ఆ సామర్థ్యాన్ని మరింత పెంచింది. ఈ ప్రయోగం కోసం ‘మిథిలీన్ బ్లూ’ అనే ల్యాబ్ డైని ఉపయోగించి ఆర్డునో ఆధారిత స్పెక్ట్రోమీటర్ ద్వారా పరీక్షలు నిర్వహించగా, ఈ టాబ్లెట్లు 93.94% కలుషితాలను తొలగించినట్లు తేలింది.
