ఓట్ల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు కొందరు ఓటర్లు నిర్భయంగా.. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా నిలదీస్తుంటారు. అలాంటి ఓటరు కేంద్రమంత్రికి ఎదురయ్యాడు. మీరు ఇప్పుడు ఓటు వేస్తే సరి.. లేదంటే ఈసారి ఓట్లు అడిగేందుకు వస్తారు కదా.. అప్పుడు మేము ఓటు వేయం అంటూ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు షాకిచ్చాడు ఒక ఓటర్. షాక్ తిన్న మంత్రి ఓటర్ తో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
2026 సెప్టెంబర్ 19న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఈ వింత అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ లోని తన పార్లమెంటు నియోజకవర్గం అయిన గుణ లో ఒక వ్యక్తి నిర్భయంగా దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు.
గుణలో రోడ్లు వేయాలని స్థానికులు ధర్నా నిర్వహించారు. రోడ్లు వేయకుంటే ఓట్లు వేయం (రోడ్ నహీతో ఓట్ నహీ) అనే ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు స్థానికులు. గ్రామంలోకి వెళ్తున్న మంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. ఇది మా రిక్కెస్ట్.. ఈ సారి రోడ్లు వేయకుంటే.. కాలనీ మొత్తం మీకు ఓట్లు వేయం అని ముఖం మీదనే అనేశారు స్థానికులు.
మంత్రి వ్యాఖ్యలు వైరల్:
స్థానికుల మాటలకు ఆగ్రహించిన మంత్రి.. ఇలాంటి మాటలు నా దగ్గర నడవవు.. అర్థమైందా..? నేను అందరితో మాట్లాడుతున్న. నువ్వు వచ్చి నీ అభ్యర్థన ఏంటో చెప్పు. పని చేసే బాధ్యత నాది. అంతే కాని బెదిరించడం కాదు.. అంటూ సీరియస్ అయ్యారు.
I watched these two videos of Maharaja Jyotiraditya Madhavrao Scindia.
— Incognito (@Incognito_qfs) September 18, 2026
In first video, Maharaj Scindia ji praised Bittu Tabahi for cleaning Ajnar River alone. He said that Bittu did not question MP or MLA or councillor. Instead, Bittu cleaned the whole river himself and showed… pic.twitter.com/EO1EZmRENL
మంత్రికి స్థానికులకు మధ్య సంవాదం జరిగిన గంటన్నరకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా రోడ్లు వేసేందుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా నుంచి నిధులు విడుదల చేస్తామని గుణ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చెప్పారు.
