సై, గజినీ, ఛత్రపతి మొదలైన బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఆగస్టు 04) ముంబయిలో గుండెపోటుతో మృతి చెందారు.
ఆయన గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు నటి విపన థప మీడియాకు తెలిపారు.
ప్రదీప్ రావత్ తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తెలుగులో 2004లో వచ్చిన సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్రతో చూపించిన విలనిజంతో పాపులర్ అయ్యారు. ఆ సినిమాకు బెస్ట్ విలన్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత గజినీ, భద్ర,అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్ మొదలైన సినిమాలతో తన విలనిజాన్ని పండించారు. లేటెస్టుగా వాల్తేరు వీరయ్య, గాయపడ్డ సింహం సినిమాల్లో నటించారు.
1952లో జబల్పూర్ లో జన్మించారు. ఆయనకు భార్య కళ్యాణి రావత్, ఇద్దరు కుమారులు విక్రమ్ రావత్, సింగ్ రావత్ లు ఉన్నారు. బీ.ఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారతంలో అశ్వథ్థామ పాత్రతో ఆయన వెందితెరకు పరిచయమయ్యారు.
ప్రదీప్ రావత్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. హిందీలో సర్ఫరోష్, లగాన్, దీవార్, గజినీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.
