టైప్-సి ఛార్జింగ్తో వస్తున్న కీ ప్యాడ్ మొబైల్.. AI బ్యాటరీ కూడా.. ధర కేవలం 949 రూపాయలే !

టైప్-సి ఛార్జింగ్తో వస్తున్న కీ ప్యాడ్ మొబైల్.. AI బ్యాటరీ కూడా.. ధర కేవలం 949 రూపాయలే !

చైనీస్ ఫోన్ల తయారీ కంపెనీ itel Mobile సరికొత్త ఫీచర్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. కేవలం 949 రూపాయలకే ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు.. కీప్యాడ్ మొబైల్స్లో లేని USB టైప్-C ఛార్జింగ్‌తో వస్తున్న ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది. ఈ మొబైల్ పేరు ఐటెల్ ఏస్ 3 హీరా ఫీచర్ ఫోన్. ఏ కంపెనీకి చెందిన USB టైప్-C ఛార్జర్ దేనితోనైనా ఈ ఫోన్కు ఛార్జింగ్ పెట్టొచ్చు. ఎక్కడికైనా వెళుతూ ఛార్జర్ మర్చిపోయినా అక్కడ అందరి దగ్గర అందుబాటులో ఉండే C-టైప్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు వాడే అదే కేబుల్‌ను ఉపయోగించవచ్చు. 1000mAh బ్యాటరీ, AI బ్యాటరీ ఆప్టిమైజేషన్, బ్లూటూత్, వైర్ లెస్ ఎఫ్ఎం ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఏస్ 3 హీరా ఫీచర్ మొబైల్స్ నీలం, ఊదా, నలుపు రంగులలో అందుబాటులోకి వచ్చాయి. బయట మొబైల్ షాప్స్లో ఈ ఫోన్ అమ్మకాలు జరుగుతాయి.  AI ఆప్టిమైజేషన్‌తో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉండేలా ఈ ఫీచర్ ఫోన్ను తయారుచేశారు.

మొబైల్లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫోన్ వాడుకునే విధంగా, ఛార్జింగ్ సేవ్ చేసే విధంగా.. ఇందులో సూపర్ బ్యాటరీ మోడ్ కూడా ఉంది. బ్లూటూత్, వైర్‌లెస్ FM కూడా ఉంది. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు లేదా స్పీకర్లకు కూడా మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ వేస్తే 32GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ఆటో కాల్ రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది. ఇందులో కింగ్ టాల్కర్ అనే వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ వాయిస్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. కొత్తగా కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఈ వాయిస్ అసిస్టెంట్ హెల్ప్ ఫుల్గా ఉంటుంది. ఐటెల్ ఈ మొబైల్కు ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా ఇస్తోంది.