టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఇండో–-పాక్ హైఓల్టేజ్ పోరును బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూ-టర్న్ తీసుకున్నట్టుగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. లాహోర్లో ఐసీసీతో జరిగిన సమావేశం అనంతరం పాకిస్తాన్కు ఒక విషయం స్పష్టమైంది.
టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే తమ మూడు ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) మూడు డిమాండ్లు పెట్టింది. అయితే.. ఈ మూడు డిమాండ్లను ICC నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఈ డిమాండ్లకు తలొగ్గాలని బీసీసీఐకి చెప్పలేమని ICC కుండబద్ధలు కొట్టింది. దీంతో.. తమ పప్పులేమీ ఉడక్కపోవడంతో చేసేదేమీ లేక టీమిండియాతో మ్యాచ్ బాయ్కాట్ నిర్ణయంపై పాకిస్తాన్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
►ALSO READ | మీ పప్పులేం ఉడకవ్.. టీమిండియాతో మ్యాచ్పై పాక్ కండీషన్లను కొట్టి పారేసిన ఐసీసీ
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని తెలిసింది. ఒకే టోర్నీలో మిగతా జట్లతో ఆడుతూ కేవలం ఇండియాతోనే ఆడకపోవడం నిబంధనలకు విరుద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ICC ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ మొండి వైఖరి వల్ల కలిగే వాణిజ్య నష్టాలకు పీసీబీనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇది భవిష్యత్తులో పాక్ క్రికెట్ ఉనికికే ప్రమాదకరమని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ నుంచి వచ్చిన కఠినమైన హెచ్చరికల నేపథ్యంలో, పీసీబీ ఇప్పుడు ఘర్షణ కంటే మ్యాచ్ ఆడేందుకే మొగ్గు చూపుతుండటం గమనార్హం.
BCB President Md Aminul Islam says: “Following my short visit to Pakistan yesterday and given the forthcoming outcomes of our discussions, I request Pakistan to play the ICC T20 World Cup game on 15 February against India for the benefit of the entire cricket ecosystem.” pic.twitter.com/fyvP9awdH3
— ANI (@ANI) February 9, 2026
